SRD: శాంతి, ప్రేమ, సేవా గుణాలకు ఏసుక్రీస్తు ప్రతీక అని ఆరోగ్య శాఖ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే దామోదర్ రాజనర్సింహ తెలిపారు. జోగిపేటలో నిర్వహించిన క్రిస్మస్ ముందస్తు వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో మంత్రి కేక్ కట్ చేసి, క్రైస్తవ సోదరసోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.