W.G: రైతు గొప్పతనాన్ని చాటి చెప్పడమే జాతీయ రైతు దినోత్సవం ముఖ్య ఉద్దేశ్యమని సీనియర్ జర్నలిస్ట్ గుండా రామకృష్ణ అన్నారు. ఇవాళ వీరవాసరంలో రైతు దినోత్సవం నిర్వహించారు. కాపు వనిత సభ్యులు రైతుల వద్దకు వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. ముగ్గురు రైతులను సత్కరించి పండ్లు అందజేశారు. దేశ ఐదవ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ను గుర్తుచేస్తూ ఆధునిక పద్ధతిలో సాగు చేయాలన్నారు.