KNR: తమకు రావాల్సిన పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, కనీస వేతనం రూ.18 వేలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ కొత్తపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎదుట ఆశావర్కర్లు నిరసన చేపట్టారు. యూనియన్ నాయకురాలు రాఘవేని శారద ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. అనంతరం తమ సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని వైద్యాధికారికి అందజేశారు.