ADB: మంచిర్యాల్ జిల్లా సోమగూడెం త్రినేత్ర ఫంక్షన్ హాల్లో 21-12-2025న జరిగిన జాతీయ స్థాయి యోగా, కరాటే పోటీల్లో నార్నూర్ పీఎమ్ శ్రీ ఆదర్శ పాఠశాల విద్యార్థులు మెరుగైన ప్రతిభ కనబరిచారు. ఈ విజయాలపై ప్రిన్సిపల్ ప్రశాంత్ సంతోషం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇంకా ఎన్నో బహుమతులు సాధించి పాఠశాలకు మంచి గుర్తింపు తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు.