TG: సచివాలయంలో అన్ని విభాగాల కార్యదర్శులతో సీఎం రేవంత్ భేటీ అయ్యారు. గతంలో విద్య, ఎనర్జీ, ఇరిగేషన్, హెల్త్ పాలసీలు లేవని, దీంతో అనేక సమస్యలు వచ్చాయని సీఎం అన్నారు. రెండేళ్లలో ముఖ్యమైన విభాగాలకు పాలసీలు తీసుకొచ్చినట్లు తెలిపారు. ప్రతి నెలా కార్యదర్శుల పనితీరుపై సీఎస్ సమీక్షిస్తారని, ప్రతి మూడు నెలలకోసారి కార్యదర్శుల పనితీరుపై తానే సమీక్షిస్తానని సీఎం రేవంత్ వెల్లడించారు.