NGKL: కోడేరు మండలం నర్సాయిపల్లి గ్రామంలో నేషనల్ ఆగ్రో ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొర్రమీను చేపపిల్లలను శివారెడ్డి చెక్ డ్యాంలో విడుదల చేశారు. అనంతరం PMMSY పథకం ద్వారా కులవృత్తులను ప్రోత్సహిస్తూ చేపలవేట పనిముట్ల దుకాణాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఏఎఫ్ జేడీ ప్రకాష్, డీఎఫ్సీఎస్ ఛైర్మన్ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.