E.G: కొవ్వూరుకి చెందిన ఏపీ రాష్ట్ర ఎస్సీ కమిషన్ ఛైర్మన్ కే.ఎస్.జవహర్‌ను మంగళవారం MRPS రాష్ట్ర అధ్యక్షులు, పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ విజయవాడలో కలిశారు. ఈ సందర్భంగా ఆంధ్ర రాష్ట్రం విభజన అనంతరం బేడ, బుడగ జంగం కులాలను దళితుల జాబితా నుంచి విడదీయడం జరిగిందన్నారు. ఈ అంశంపై గతంలో ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసినప్పటికీ న్యాయం జరగలేదన్నారు.