BHNG: ఆలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో గెలిచిన సర్పంచులు ఉపసర్పంచ్లు వార్డ్ మెంబర్లు గ్రామ అభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. మంగళవారం యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీనరసింహ ఫంక్షన్ హాల్లో సర్పంచులకు జరిగిన ఆత్మీయ సన్మాన సభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.