KMM: ఖమ్మం వెలుగుమట్ల అర్బన్ పార్క్ వెళ్లే రోడ్డులో జరుగుతున్న అభివృద్ధి పనులను మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య మంగళవారం పరిశీలించారు. రోడ్డు పనుల పురోగతి, నిర్మాణ నాణ్యతను కమిషనర్ పరిశీలించి సంబంధిత ఇంజనీర్ అధికారులతో చర్చించారు. రోడ్డు నిర్మాణంలో ఉపయోగిస్తున్న మెటీరియల్ నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు.