VZM: ప్రాజెక్టులకు చేపట్టిన భూసేకరణ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వివిధ ప్రాజెక్టులకు భూసేకరణకు సంబంధించి కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో మంగళవారం సాయంత్రం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో జేసీ ఎస్.సేధుమాధవన్ పాల్గొన్నారు.