CTR: చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ను నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ కలెక్టర్ కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలు పెండింగ్లో ఉన్న EAP రోడ్లు నిర్మాణం, ఉచిత ఇండ్ల స్థలాలు, రెవెన్యూ సమస్యలు, నియోజకవర్గంకు సంబందించిన పలు విషయాలపై చర్చించారు. ఈ అభివృద్ధి కార్యక్రమాలపై కలెక్టర్ సుమిత్ కుమార్ సానుకూలంగా స్పందించారు.