SS: రానున్న సంక్రాంతిని దృష్టిలో పెట్టుకుని ఆప్కో షో రూమ్ల భారీ డిస్కౌంట్ అమ్మకాలు చేయనున్నట్లు మంత్రి సవిత తెలిపారు. మంగళవారం తాడేపల్లిలో చేనేత, జౌళి శాఖాధికారులతో మంత్రి సవిత సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. 60, 50, 40 శాతాల డిస్కౌంట్లపై చేనేత వస్త్రాలను విక్రయించనున్నామని, ఇందుకోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు.