రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘రాజాసాబ్’ సినిమా జనవరి 9న విడుదల కానుంది. కాగా, ఈ చిత్రం 3 గంటల 06 నిమిషాల సుదీర్ఘ రన్ టైంతో రానున్నట్లు సమాచారం. ఇందులో ఫస్ట్ హాఫ్ గంటా 23 నిమిషాలు, సెకండ్ హాఫ్ గంటా 43 నిమిషాలు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ‘కల్కి’ తర్వాత ప్రభాస్ నుంచి వస్తున్న సినిమా కావడంతో, ‘రాజాసాబ్’పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.