TG: కేంద్రంపై KCR అన్నీ అబద్ధాలే మాట్లాడారని BJP చీఫ్ రామచందర్ రావు ఆరోపించారు. ‘రాష్ట్ర నీటి వాటా కంటే తక్కువకే KCR సంతకం చేశారు. రాష్ట్ర రైతులకు కేంద్రం రూ.3.7 లక్షల కోట్లు ఇస్తోంది. కేంద్ర పథకాలు ప్రజలకు అందకుండా చేస్తున్నారు. రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది శూన్యం. జలాల విషయంలో KCR సెంటిమెంట్ రెచ్చగొడుతున్నారు. BRS వల్లే రైతులకు నష్టం జరిగింది’ అని అన్నారు.