ATP: పెద్దవడుగూరు మండల పరిధిలోని గేట్స్ కళాశాలలో మంగళవారం క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ శ్వేత మాట్లాడుతూ.. అనారోగ్య ఆహార అలవాట్లు, శారీరక వ్యాయామ లోపం వంటి అంశాలను విద్యార్థులకు వివరించారు. రోజు తాజా ఆకుకూరలు, పండ్లు, సంపూర్ణ ధాన్యాలు వంటి సహజ ఆహారాలను తీసుకోవాలని సూచించారు.