VZM: జిల్లా పోలీసు శాఖ ట్రాఫిక్ కానిస్టేబుల్ బి.ఎస్.ఎన్. మూర్తి హైదరాబాద్లో ఈనెల 12 నుంచి 14 వరకు జరిగిన 14వ జాతీయ స్థాయి సీనియర్ తైక్వాండో ఛాంపియన్షిప్ పోటీల్లో బ్రాంజ్ పతకం సాధించారు. ఈ సందర్భంగా SP దామోదర్ తన ఛాంబర్లో మూర్తిని మంగళవారం అభినందించి, భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించి పోలీసు శాఖకు గర్వకారణంగా నిలవాలని ఆకాంక్షించారు.