NZB: ప్రస్తుత కాలానికి అనుగుణంగా పోలీస్స్టేషన్ రైటర్లు శాస్త్ర సాంకేతికతను వినియోగించుకోవాలని అదనపు డీసీపీ (అడ్మిన్) బస్వారెడ్డి సూచించారు. ఈ మేరకు మంగళవారం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ హాల్లో స్టేషన్ రైటర్లకు శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అదనపు డీసీపీ స్టేషన్ రైటర్లకు నూతన చట్టాలపై అవగాహన కల్పించారు.