NLG: నకిరేకల్ మున్సిపాలిటీ కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన మీ సేవ కేంద్రాన్ని మంగళవారం నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మున్సిపాలిటీ అధికారులు, సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు సులభంగా, వేగంగా అందించడమే మీ సేవ కేంద్రాల లక్ష్యమని ఆయన తెలిపారు.