కృష్ణా: తెలుగుజాతి కీర్తి కిరీటం పీవీ నరసింహారావు అని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. మంగళవారం అవనిగడ్డలో భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాలవేసి ఘన నివాళి అర్పించారు. న్యాయ శాఖ మంత్రిగా అవనిగడ్డకు మున్సిఫ్ కోర్టు, విద్యాశాఖ మంత్రిగా జూనియర్ కళాశాల మంజూరు చేసిన ఘనత పీవీకే దక్కుతుందన్నారు.