»Dont Believe False Propaganda On Annaprasad In Tirumala Ttd
TTD: తిరుపతి ప్రసాదంలో వచ్చే ప్రచారాలు నమ్మొద్దు
తిరుమల తిరుపతి గురించి కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో స్వామివారికి నివేదించే ప్రసాదంలో పలు మార్పులు చేస్తున్నారని, సేంద్రియ బియ్యం వినియోగాన్ని ఆపుతున్నారని ఈ మేరకు టీటీడీ నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై ఆలయ ఈవో స్పందించారు.
Don't believe false propaganda on Annaprasad in Tirumala: TTD
TTD: తిరుమల (Tirumala) శ్రీవారికి నివేదించే అన్నప్రసాదం (Annaprasadam)పై వస్తున్న వార్తలను టీటీడీ ఖండించింది. అవన్ని వాస్తవాలు కావాని వాటిని భక్తులు ఎవరు నమ్మవద్దని టీటీడీ(TTD) అధికారులు స్పష్టం చేశారు. ప్రసాదంలో వాడే సేంద్రియ బియ్యాన్ని నిలిపివేశారని, వాటి స్థానంతో గతంలో వినియోగించే బియ్యాన్ని వాడుతున్నట్లు.. ఈ మేరకు టీటీడీ అధికారికరంగా ప్రకటించినట్లు వార్తలు శికార్లు కొడుతున్నాయి. దీనితో పాటు అన్నప్రసాదాల దిట్టంకూడా పెంచాలని టీటీడీ నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి. వీటికి సంబంధించిన వార్తలను, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాలు పూర్తిగా తప్పు అని ఆలయ ఈవో జె శ్యామల రావు స్పష్టం చేశారు.
ఈ విషయం గురంచి అర్చక స్వాములు, ఆలయ అధికారులతో సమావేశమయ్యారని, ఈ సందర్భంగా స్వామివారికి నివేదించే అన్న ప్రసాదాల గురించి, వాటి దిట్టం గురించి సుదీర్ఘంగా చర్చించామని పేర్కొన్నారు. అయితే కొత్తగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదని ఆయన చెప్పారు. ఇప్పుడు భక్తుల రద్ధీ కాస్త తక్కువగా ఉందని, టోకెన్లు లేని భక్తులకు 6 నుంచి 8 గంటలలో సర్వదర్శనం కలుగుతుందని అధికారులు తెలిపారు.