E.G: రుణం కట్టలేదనే సాకుతో రికవరీ ఏజెంట్లు బలవంతంగా వాహనాలను లాక్కెళ్లడం చట్టవిరుద్ధమని JAC సభ్యుడు మడతల శంకరం తెలిపారు. దేవరపల్లిలో మాట్లాడుతూ.. సీజ్ చేసే ముందు కచ్చితంగా నోటీసు ఇవ్వాలని, బలవంతం చేస్తే అది దోపిడీ కిందకే వస్తుందని స్పష్టం చేశారు. బాధితులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చని కోర్టులు వెల్లడించినట్లు పేర్కొన్నారు.