PDPL: రామగుండం పోలీస్ కమీషనరేట్ ఆదేశాల మేరకు పెద్దపల్లి ట్రాఫిక్ పోలీసులు మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు చేపట్టారు. ప్రత్యేక తనిఖీల్లో పట్టుబడిన 20 మందిని పెద్దపల్లి కోర్టులో హాజరుపరచగా రూ. 20,400 జరిమానా విధించారు. పునరావృతంగా నేరం చేసిన గుండార్తి మల్లేష్‌కు రెండు రోజుల జైలు శిక్ష పడింది. ప్రమాదాల నివారణే లక్ష్యంగా ఈ చర్యలు కొనసాగుతాయన్నారు.