CTR: ప్రతి భక్తుడికి నాణ్యమైన భోజనం అందించాలని దేవాదాయశాఖ తిరుపతి ఆర్జేసీ చంద్రశేఖర్ ఆజాద్ ఆదేశించారు. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దర్శనార్థం వచ్చే భక్తులకు నాణ్యమైన, రుచికరమైన భోజనం అందజేయాలని ఆయన పేర్కొన్నారు. ఆలయంలో భక్తులకు అందజేస్తున్న భోజనాన్ని భక్తులు, ఈవో పెంచల కిశోర్‌తో కలిసి బుధవారం పరిశీలించి ఆపై అన్నప్రసాదం స్వీకరించారు.