NZB: భీంగల్ మండలం బెజ్జోరా గ్రామ శివారులోని పోచమ్మ దేవాలయం సమీపంలో అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుక డంప్‌ను రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఇసుక డంప్ 140 ట్రాక్టర్ల వరకు ఉంటుందని ఆరొ సాయాగౌడ్ తెలిపారు. స్వాధీనం చేసుకున్న ఇసుకను నేడు తహసీల్దార్ కార్యాలయం వద్ద వేలం వేస్తున్నట్లు పేర్కొన్నారు.