MBNR: నగరంలోని మహిళలు, పిల్లలపై నేరాల (POCSO) ప్రత్యేక న్యాయస్థానంలో న్యాయమూర్తి తమన్ రాజ రాజేశ్వరి కీలక తీర్పు ఇచ్చారు. భూత్పూర్ మండలం కొత్తూరుకు చెందిన చిట్లపల్లి సతయ్య (47) బాలికపై లైంగిక దాడి చేసినట్లు రుజువుకావడంతో అతడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధించారని జిల్లా ఎస్పీ తెలిపారు. బాధిత బాలికకు రూ.5 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించారన్నారు.