ASF: ఈనెల 31 నుంచి ఫిబ్రవరి 2 వరకు నిర్వహించనున్న శ్రీ బాలాజీ వేంకటేశ్వర స్వామి జాతర ఉత్సవాలకు అన్ని శాఖల అధికారులు పనిచేసి విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే ఆదేశించారు. రెబ్బెన మండలంలో ఎస్పీ నితికా పంత్, ASP చిత్తరంజన్లతో కలిసి అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు పక్కాగా ఉండాలన్నారు.