PDPL: ప్రభుత్వ సంక్షేమ పథకాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సూచించారు. రామగుండంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం స్వశక్తి మహిళలతో సమావేశం అయ్యారు. మహిళలు ఆర్థిక, సామాజికంగా బలపడితే కుటుంబం, సమాజం ముందుకు సాగుతుందని తెలిపారు. స్వశక్తి సంఘాల ద్వారా మహిళలు స్వయం ఉపాధి సాధించి నిలబడుతున్నారని అభినందించారు.