ADB: నూతనంగా ఎన్నుకోబడిన సర్పంచులు, అధికారులతో సమన్వయంతో మండల అభివృద్ధి కోసం పని చేయాలని ఎంపీడీవో శ్రీనివాస్ అన్నారు. ఎంపీడీవో కార్యాలయంలో సర్పంచ్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. గ్రామపంచాయతీ సర్పంచులుగా అధికంగా యువత గెలుపొందారన్నారు. పంచాయతీ చట్టాలపై అవగాహన పెంచుకొని గ్రామాభివృద్ధిపై దృష్టి సాధించాలన్నారు.