NLG: చిట్యాల పురపాలికలోని 12 వార్డుల్లో ఇవాళ సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపనలు జరగనున్నాయి. తెలంగాణ అర్బన్ ఫైనాన్స్, ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా మంజూరైన రూ. 3 కోట్ల నిధులతో ఈ పనులు చేపట్టనున్నారు. సీసీ రోడ్ల కోసం పలు వీధులకు చెందినవారు చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. ఒక్కో వార్డులో సుమారు రూ. 25 లక్షలతో పనులు జరగనున్నాయి.