SKLM: నరసన్నపేట జాతీయ రహదారిపై లారీలో హైద రాబాద్‌కు అక్రమంగా తరలిస్తున్న 45 పశువులను హైవే పెట్రోలింగ్ పోలీసు సిబ్బంది గురువారం పట్టుకున్నారు. అనంతరం నరసన్నపేట పోలీసులకు వాహనాన్ని అప్పగించారు. అనంతరం నిందుతుడిపై కేసు నమోదు చేసి , వాహనాన్ని సీజ్ చేసినట్లు ఎస్సై శేఖరరావు తెలిపారు. ఈ మూగజీవాలను కొత్తవలస గోశాలకు తరలించామని ఎస్సై పేర్కొన్నారు.