SKLM: రథసప్తమి వేడుకల్లో రూ.100 దర్శనం, ఉచిత దర్శనం క్యూలైన్లలో వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకూడదని జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి అన్నారు. బుధవారం సాయంత్రం తన కార్యాలయంలో పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు. భక్తుల రాకపోకలకు అంతరాయం కలగకుండా ప్రత్యేక ట్రాఫిక్ ప్రణాళికను అమలు చేయాలని, సీసీటీవీ కెమెరాలతో నిరంతర నిఘా ఏర్పాటు చేయాలని అన్నారు.