E.G: రాయవరంలో శుక్రవారం జరగనున్న రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా రాజముద్రతో కొత్తగా వచ్చిన పట్టాదారు పాస్ పుస్తకాలను లబ్ధిదారులకు సీఎం పంపిణీ చేస్తారు. సీఎం పర్యటన నిమిత్తం రాయవరంలో అధికార యంత్రాంగం భారీగా ఏర్పాట్లు చేసింది. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు టీడీపీ కార్యకర్తలతో ఆయన సమావేశం అవుతారు.