నల్గొండ పట్టణ ప్రజలకు కొత్త సంవత్సరం కానుకగా కార్పొరేషన్‌ను ప్రభుత్వం ప్రకటించిందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. పట్టణ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి రిటర్న్ గిఫ్టుగా గెలుపును ఇవ్వాలని మంత్రి కోరారు. కార్పొరేషన్‌లోని 45 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని, ప్రస్తుతం రూ.200 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని అన్నారు.