VSP: భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడుకు గురువారం రాత్రి విశాఖపట్నం విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. నగర పర్యటనకు విచ్చేసిన ఆయనకు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పుష్పగుచ్ఛాలు అందజేసి, కండువాలతో సత్కరించి సాదరంగా ఆహ్వానించారు. స్వాగతం పలికిన వారిలో మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్ర ఉన్నారు.