ADB: రంగారెడ్డి జిల్లాలోని మోకిల వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మంచిర్యాల జిల్లా కేంద్రంలోని జన్మభూమి నగర్‌కు చెందిన విద్యార్థి దుర్మరణం చెందారు. మంచిర్యాలకు చెందిన దేవుళ్ల సూర్యతేజ హైదారాబాద్‌లో చదువుతున్నాడు. స్నేహితుడి బర్త్ డే వేడుకలు జరుపుకొని కారులో తిరిగి వస్తుండగా అదుపుతప్పి చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. ఈ ఘటనకు సంబందించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.