AP: నెల్లూరులో టెన్షన్ వాతావరణం నెలకొంది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వివాదం నేపథ్యంలో సోమశిల ప్రాజెక్ట్ సందర్శనకు YCP పిలుపునిచ్చింది. అయితే ఇందుకు అనుమతి లేదని నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే మాజీమంత్రి కాకాణి గోవర్దన్‌ను హౌస్ అరెస్ట్ చేయడంతో పాటు ఇతర పార్టీ నేతల ఇళ్ల వద్ద పహారా ఏర్పాటు చేశారు. అటు సోమశిల ప్రాజెక్ట్ వద్ద కూడా బందోబస్తు ఏర్పాటు చేశారు.