MDK: మనోహరాబాద్ మండలం కాళ్లకల్ గ్రామానికి చెందిన భూనిర్వాసుల సంఘం అధ్యక్షుడు మైలారం నరసింహ ఇవాళ అనారోగ్యంతో మృతి చెందాడు. కాళ్లకల్, ముప్పిరెడ్డిపల్లి శివారులోని అసైన్డ్ భూములను ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు కోసం ప్రభుత్వం భూసేకరణ చేపట్టింది. భూ నిర్వాసితుల కోసం మైలారం నరసింహ పోరాటం చేశారు. ప్రభుత్వం హామీ మేరకు ఇంటికో ఉద్యోగం, ఇళ్ల కోసం పోరాటం చేశారు.