NDL: తాడిపత్రి–కోవెలకుంట్ల ప్రధాన రహదారి శిథిలావస్థకు చేరుకుంది. కొలిమిగుండ్ల(మం) అంకిరెడ్డిపల్లె నుంచి తిమ్మనాయినిపేట వరకు సుమారు 13 కిలోమీటర్ల మేర రహదారి దెబ్బతినడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు అయినా రహదారి నిర్మాణం చేపట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.