SKLM: జిల్లా క్రీడా రంగంలో మరో ముందడుగు పడింది. ఖేలో ఇండియా పథకం కింద పాత్రునివలసలో రూ.14 కోట్లతో ఇండోర్ స్పోర్ట్స్ హాల్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసినట్లు ఎంపీ, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గురువారం రాత్రి ప్రకటనలో తెలిపారు. ఈ నిధులు కేటాయించి నందుకు కేంద్ర మంత్రి మాన్సుఖ్ మాండవియకు కృతజ్ఞతలు తెలిపారు.