ప్రకాశం: మార్కాపురం పట్టణంలోని స్థానిక లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ కార్యనిర్వణాధికారి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా ఇవాళ ఉదయం 10 గంటలకు లక్ష తులసి అర్చన జరుగుతుందని భక్తులు పాల్గొనాలని కోరారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు పేర్కొన్నారు.