TG: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు సాయంత్రం వేళ స్నాక్స్ అందించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. ఫిబ్రవరి 16 నుంచి మార్చి 10 వరకు స్నాక్స్ పంపిణీ చేస్తారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు నవీన్ నికోలస్ రూ.4.23 కోట్లు మంజూరు చేశారు. ప్రభుత్వ, ZP, మోడల్ స్కూళ్లలో సాయంత్రం జరిగే ప్రత్యేక తరగతులకు హాజరయ్యే వారికి ఈ ఆహారం అందిస్తారు.