AKP: బైక్ చోరీ కేసులో రెడ్డి పైడంనాయుడికి అనకాపల్లి జూనియర్ సివిల్ జడ్జి రమేష్ 5 నెలలు జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చినట్లు సిఐ మల్లికార్జునరావు బుధవారం తెలిపారు. పరవాడ సినిమా హాల్ జంక్షన్ వద్ద గత ఏడాది జూన్ నెలలో పార్కు చేసిన బైక్ను చోరీ చేసినట్లు తెలిపారు. బైక్ స్వాధీనం చేసుకుని నిందితుడిపై చార్జిషీట్ దాఖలు చేసినట్లు చెప్పారు.