యాషెస్ సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా సరికొత్త చరిత్ర లిఖించింది. ఒకే ఇన్నింగ్స్లో అత్యధికంగా 7 50+ రన్స్ భాగస్వామ్యాలు నెలకొల్పిన జట్టుగా నిలిచింది. 5వ టెస్టు తొలి ఇన్నింగ్స్లో ఆసీస్ ఈ ఘనత సాధించంది. దీంతో 134 ఏళ్ల క్రితం 1892లో అడిలైడ్ వేదికగా ఇంగ్లండ్ నమోదు చేసిన 6 50+ పరుగుల భాగస్వామ్యాల రికార్డు బ్రేక్ అయింది.