MNCL: జన్నారం మండలంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసిన వారు ఎన్నికల ఖర్చుల వివరాలను సమర్పించాలని ఎంపీడీవో ఉమర్ షరీఫ్ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికల్లో పోటీ చేసిన వ్యక్తులు తప్పనిసరిగా ఎన్నికల ఖర్చుల వివరాలను సమర్పించాల్సి ఉంటుందన్నారు. గెలిచిన, ఓడిన అభ్యర్థులు శుక్రవారంలోగా ఖర్చుల వివరాలను ఇవ్వాలన్నారు.