కృష్ణా: కంకిపాడులో సీఐ మురళీకృష్ణ ద్విచక్ర వాహనదారులకు గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాల వల్ల ప్రాణ నష్టం జరగకుండా ఉండాలంటే హెల్మెట్ ధరించడం అవసరమని తెలిపారు. హెల్మెట్ ధరించకపోవడం వల్ల కలిగే ప్రమాదాలు గురించి వివరించి, కుటుంబ భద్రత కోసం ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని సూచించారు.