AP: అనంతపురం జిల్లా రాయదుర్గంలో గూడ్స్ రైలు నుంచి బోగీలు విడిపోయాయి. ఇనుప ఖనిజం లోడ్‌తో కర్ణాటక విజయనగర జిల్లా తోరణగల్లులో జిందాల్ ఫ్యాక్టరీకి రైలు వెళ్తున్నట్లు సమాచారం. బోగీ లింగ్ విరిగిపోవడంతో రైలు ఆగింది. 60 బోగీలు ఉన్న గూడ్స్ రైలులో 6వ బోగీ వద్ద లింగ్ తెగిపోయింది. రెండు కి.మీ. మేర రైలు ఇంజిన్ ముందుకు వెళ్లిపోయింది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.