BDK: సుజాతనగర్ మండల పరిధిలోని మంగపేట 11 కేవీ ఫీడర్ మరమ్మతుల కారణంగా నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనుంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు మంగపేట, లక్ష్మీదేవిపల్లి గ్రామాల్లో విద్యుత్ నిలిపివేస్తున్నట్లు ఏఈ కిషన్ తెలిపారు. పనుల దృష్ట్యా విద్యుత్ వినియోగదారులు సిబ్బందికి సహకరించాలని అధికారులు కోరారు.