AP: పూరీ-తిరుపతి(17479) రైలు B5 బోగీలో స్వల్ప మంటలు చెలరేగాయి. తుని-అన్నవరం మధ్య ఉదయం 6 గంటల సమయంలో ఘటన జరిగింది. బోగీలో విద్యుత్ ప్యానల్ బోర్డు వద్ద దుప్పట్లకు మంటలు అంటుకున్నాయి. రైల్వే సిబ్బంది అప్రమత్తమై మంటలు వ్యాపించకుండా అదుపు చేశారు. రాజమండ్రి స్టేషన్ వద్ద రైల్వే సిబ్బంది బోగీని పరిశీలించారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై రైల్వే అధికారులు ఆరా తీస్తున్నారు.