TG: తెలుగు రాష్ట్రాల్లో 2018లో ప్రణయ్ పరువు హత్య కేసు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న శ్రవణ్‌కుమార్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. జీవిత ఖైదును సవాల్ చేస్తూ తాను దాఖలు చేసిన పిటిషన్ విచారణ ముగిసే వరకు బెయిల్ ఇవ్వాలని శ్రవణ్ మధ్యంతర పిటిషన్ వేశారు. కోర్టు అతని వయసు, జైలు జీవితాన్ని పరిగణనలోకి తీసుకుని బెయిల్ ఇచ్చింది.