KMM: కూసుమంచికి చెందిన రాజీవ్ సిద్ధార్థ్ అంతర్జాతీయ సినీ వేదికపై సత్తా చాటాడు. ఆయన దర్శకత్వం వహించిన ‘జాన్’ మ్యూజికల్ ఫిల్మ్ ఏకంగా 75 అంతర్జాతీయ, 50 రాష్ట్ర స్థాయి అవార్డులను కొల్లగొట్టి రికార్డు సృష్టించింది. నటుడిగా ప్రయాణం ప్రారంభించి, ఉత్తమ దర్శకుడిగా ‘లోకల్ టు గ్లోబల్’గా గుర్తింపు తెచ్చుకున్నాడు. మారుమూల గ్రామం నుంచి వెళ్లి అంతర్జాతీయ వేదికపై సత్తా చాటాడు.